728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 10, 2020

గాలి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది

జెనివా:
★ అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది.

★ కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తించే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) గుర్తించింది.

★ జనసమ్మర్ధం అధికంగా కలిగిన గదిలాంటి ప్రాంతాలు, ఇన్ఫెక్షన్​ సోకిన వ్యక్తులు ఉండి..

★ సుదీర్ఘకాలం పాటు గాలి, వెలుతురు సరిగా లేని గదులలో వైరస్ గాలి ద్వారా విస్తరించే అవకాశమున్నట్లు పేర్కొంది.

★ ఇటీవల 200 మందికిపైగా శాస్త్రవేత్తలు.. గాలి ద్వారా వైరస్​ వ్యాపిస్తుందంటూ డబ్ల్యూహెచ్​ఓకు లేఖ రాశారు.

★ అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను, సంరక్షణ చర్యలను సవరించాలని అందులో పేర్కొన్నారు.

★ ఈ నేపథ్యంలోనే గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

★ అంతేకాకుండా లక్షణాలు లేకుండానే కొవిడ్​-19ను వ్యాప్తి చేసే వ్యక్తుల వైఖరిని కూడా డబ్ల్యూహెచ్​ఓ గుర్తించింది.

★ వ్యాధి లక్షణాలు కనిపించకుండానే వైరస్​ వ్యాప్తి గణనీయంగా వృద్ధిచెందడానికి కారణమవుతోందని అభిప్రాయపడింది డబ్ల్యూహెచ్ఓ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గాలి ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది Rating: 5 Reviewed By: NEWS UPDATE