చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో ఒకరికి సాతులూరు గ్రామంలో ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది.
జిల్లా వైద్యాధికారులు నియోజకవర్గ అధికారులకు పంపిన సమాచారం ప్రకారం చిలకలూరిపేట పట్టణంలో మరియు ఎడ్లపాడు మండలంలో నేడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత కొద్ది రోజుల నుండి చిలకలూరిపేట పట్టణంలో రోజుకు 10 నుండి 20 లోపు పాజిటివ్ కేసులు నమోదు కావడం తెలిసిందే. అయితే నేడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు, జనం ఊపిరి పీల్చుకున్నారు.