728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 22, 2020

చిలకలూరిపేట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. ఉద్యోగికి పాజిటివ్

చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో గత వారం క్రితం ఒక ఉద్యోగి మిర్యాలగూడ నుండి ట్రాన్స్ఫర్ మీద చిలకలూరిపేట బ్రాంచ్ కి వచ్చారు. సదరు ఉద్యోగి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చేటప్పుడు బోర్డర్లో అతనికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. సదరు వ్యక్తి నరసరావుపేటలో నివాసం ఏర్పరచుకొని చిలకలూరిపేట మెయిన్ బ్రాంచ్ లో ఉద్యోగానికి మూడు రోజులు వచ్చారు.

అనంతరం నరసరావుపేటలో లాక్ డౌన్ విధించడం వల్ల అతను మూడు రోజుల నుండి చిలకలూరిపేట బ్రాంచ్ కు విధులకు రావటం లేదు. అయితే మిర్యాల గూడెంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు సమాచారం ఇవ్వడంతో మెయిన్ బ్రాంచ్ కు ఈరోజు ఉదయం ఆ వ్యక్తి సమాచారం పంపారు.

దీంతో చిలకలూరిపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రెండు రోజులు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. ఉద్యోగికి పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE