చిలకలూరిపేట: పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 125 పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అలానే ఎడ్లపాడు, నాదెండ్ల మొత్తం కలిపి ఇప్పటి వరకు సుమారు 200 కేసుల వరకు నమోదయ్యాయి. నియోజకవర్గంలో నేటికి ఏడుగురు వ్యక్తులు కరోనా తో మృతి చెందటం జరిగింది.
పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు చిలకలూరిపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్, రెవిన్యూ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా కేసులు నమోదు కావడంతో చాలా వరకు కార్యాలయాలు మూతపడ్డాయి.
ఈ విషయంపై చిలకలూరిపేట ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి అధికారులు చిలకలూరిపేటలో లాక్ డౌన్ పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గంలో లాక్ పెట్టడం వల్ల కొంతవరకు కేసులు తగ్గుదల పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికి చిలకలూరిపేటలో ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులకు సంబంధించి కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అయితే రెండు మూడు రోజుల్లో చిలకలూరిపేటలో ఒక వారం రోజులు లాక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.