చైనా నుంచి కొనుగోళ్లను క్రమంగా తగ్గించుకుంటామని హీరో సైకిల్స్ సంస్థ తెలిపింది. చైనాతో పాటు పలు దేశాల నుంచి సైకిల్ విడి భాగాలను దిగుమతి చేసుకొంటున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్ ముంజాల్ తెలిపారు. సుమారు రూ.900 కోట్ల కొనుగోళ్లకు సంబంధించిన ప్రణాళిక ఉన్నదని, క్రమంగా దీనిని తగ్గించుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుతం జర్మనీలోని తమ సంస్థకు చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో సైకిళ్ల విడి భాగాల రూపకల్పన జరుగుతున్నదని పంకజ్ ముంజాల్ వివరించారు.
సరిహద్దులో భారత్, చైనా మధ్య ఘర్షణ, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులపై ఆధారపడవద్దని, చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. అలాగే దేశంలో అమ్మే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో అన్నది పేర్కోవాలని స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంతోపాటు చైనాతో ఘర్షణ నేపథ్యంలో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుపై పలు దేశీయ సంస్థలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సైకిల్స్ కూడా చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.