728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2020

ఏపీలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు ఘోరం: చంద్రబాబు

అమరావతి:
★ ఏపీలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

★ తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలి.

★ కానీ, రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయి.

★ ఇంత ఖర్చుపెడుతున్నాం, అంత ఖర్చుపెడుతున్నాం అంటూ పాలకులు లెక్కలు చెబుతున్నారు అని అన్నారు.

★ అలాంటప్పుడు పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉంటున్నాయి?

★ పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా?

★ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి?

★ అక్షయ లాంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్ లను ఎంతో ఘనంగా నిర్వహించాం.

★ పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించండి అని చెప్పారు.

★ ఈ సందర్భంగా ఓ క్వారంటైన్‌ కేంద్రంలో రోగుల బాధలను వివరిస్తూ పలువురు బాధితులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.

★ తమ ఇబ్బందుల గురించి క్వారంటైన్‌ సిబ్బంది పట్టించుకోవట్లేదని బాధితులు పలువురు అక్కడి అధికారులను నిలదీస్తుండడం ఇందులో కనపడుతోంది.

★ అక్కడ ఎలాంటి సదుపాయాలూ కల్పించడం లేదని విమర్శించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పరిస్థితులు ఘోరం: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE