చిలకలూరిపేట: నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులైన అరుణ్ జైట్లీ అతి చిన్న వయసులో మరణించి నేటికి ఒక సంవత్సర కాలం పూర్తయినందున వారు భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. యువ నాయకుడు, పట్టణ ప్రధాన సెక్రటరీ బండారు నాగరాజు మాట్లాడుతూ ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆయన భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలు ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు డి.పుల్లయ్య, పులుగుజ్జు మహేష్, వంకాయలపాటి వంశీధర్, అన్నపురెడ్డి లక్ష్మణ్, ఆదిమూలం గురుస్వామి, గుమ్మ బాలకృష్ణ, జై రాయుడు, తన్నీరు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
August 24, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అరుణ్ జైట్లీకి నివాళి అర్పించిన భాజపా నేతలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

