నరసరావుపేట: వినాయకచవితి పండుగను పురస్కరించుకుని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని దయతో శుభాలు కలగాలని అభిలషించారు. పర్యావరణానికి హాని లేకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పండుగను ఈ ఏడాదికి ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. లోకాన్ని పట్టి పీడిస్తున్న కరోనా తొలగిపోయి ప్రజలంతా మునుపటిలా ఆనందోత్సాహాలతో, ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
August 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మట్టి ప్రతిమలతోనే పండుగ జరుపుకోవాలి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

