గుంటూరు జిల్లా: యడ్లపాడు లో జెడ్పీ ఉన్నత పాఠశాల కోసం నూతనం భవన నిర్మాణం చేపట్టేందుకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.51 కోట్లు మంజూరు చేసింది. శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ యడ్లపాడులోని జెడ్పీ పాఠశాల ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తోందన్నారు. ఏ మాత్రం వసతులు లేని రేకుల షెడ్డులో, ఇరుకు గదుల్లో ఇప్పుడు ఈ పాఠశాల ఉందని, గతంలో తాను రెండు పర్యాయాలు పాఠశాలకు వచ్చి విద్యార్థుల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. అద్దె చెల్లించేవారు లేరని, యజమాని ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, గతంలో స్థానికులు, ఉపాధ్యాయులు తనతో చెప్పారని, ఆ అద్దె తానే చెల్లిస్తానని అప్పట్లో మాట కూడా ఇచ్చానని ఎమ్మెల్యే వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకోగలిగామన్నారు. ఐదారు నెలల్లో భవన నిర్మాణం పూర్తవుతుందని, విద్యార్థుల కష్టాలు తీరిపోతాయని చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ వల్లనే సాధ్యమైందని చెప్పారు. మన భావి తరాలు చదువుకోబోతున్న పాఠశాల నిర్మాణానికి ఈ రోజు తాను శంకుస్థాపన చేయడం ప్రజలు తనకు ఇచ్చిన గొప్ప కానుక అని సంతోషం వ్యక్తంచేశారు.
August 21, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జెడ్పీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

