ముంబయి:
★ దేశంలో కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో వ్యాపార వర్గాలకు ఈ సారి కొంత నిరాశే మిగిలింది.
★ ఆర్‌బీఐ రెపోరేట్‌ను 4శాతంగా.. రివర్స్ రెపోరేటును 3.3 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించారు.
★ దీంతోపాటు అకామిడేటీవ్ విధానాన్ని కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
★ కొవిడ్ కేసుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ప్రభావం చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
★ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొంటున్నా.. కొవిడ్ కేసుల కారణంగా లాక్‌డౌన్‌లు విధించాల్సి వస్తోందని తెలిపారు.
★ పంపిణీ వ్యవస్థలకు అడ్డంకులు తలెత్తడంతో వివిధ రంగాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతోందన్నారు.
★ అంతకు ముందు పలు సంస్థలు ఆర్‌బీఐ ఈ సారి వడ్డీరేట్లను 25బేస్ పాయింట్లు తగ్గిస్తాయని అంచనావేశాయి.
రేపో రేటు అంటే..
★ ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి.
★ ఆ బ్యాంకుల వద్ద ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రేపో రేటు అంటారు.
★ దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు.
★ రేపో రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు తక్కువకే రుణాలు వస్తాయి.
★ అప్పుడు వాటి నుంచి కంపెనీలకు, వ్యక్తులకు కూడా తక్కువ రేటుకు రుణాలు అందే అవకాశం ఉంటుంది.
రివర్స్ రేపో రేటు అంటే..
★ బ్యాంకులు తమ వద్ద మిగులు నగదును రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు.
★ అలా వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు.
★ ఇది రెపో రేటు కన్నా తక్కువగా ఉంటుంది.
★ మార్కెట్లో స్థిరత్వం లేనప్పుడు బ్యాంకులు తమ అదనపు నగదు నిల్వలను ఆర్‌బీఐ వద్ద ఉంచి తక్కువైనా సరే స్థిర వడ్డీ పొందేందుకు ఇష్టపడతాయి.