పిడుగురాళ్ల: పట్టణంలో గంగమ్మ గుడి ఎదురు ఉన్న అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన 120 పడకల కోవిడ్ కేర్ ఆస్పత్రిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. అలాగే పిడుగురాళ్లలోని తిరుమల ఆక్స్ ఫర్డ్ స్కూల్ నందు ఏర్పాటు చేయబోతున్న 400 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించారు. ఈ రెండు సెంటర్లలో వసతుల కల్పన వేగంగా జరుగుతుంది. ఇవి అందుబాటులోకి వచ్చి కరోనా బాధితులకు సేవలు అందించనున్నాయి. వీటి ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలోని కరోనా బాధితులు చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు పోయె పరిస్తితులు కొంత వరకు తొలగనున్నాయి.
August 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

