728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 4, 2020

బాలుడి దారుణ హత్య.. అసలేం జరిగింది..?

చిలకలూరిపేట: సొంత అక్క కొడుకుని కడతేర్చిన కసాయి తల్లి ఉదంతమిది. చిలకలూరిపేట మండలం లింగంగుంటలో అత్యంత దారుణంగా ఉన్మాదిలా ఏడు సంవత్సరాల వయసు కలిగిన కరిముల్లాను తన పిన్ని ఆషా మతిస్థిమితం లేక పాశవికంగా కత్తితో పొట్టను కోసి రెండు భాగాలుగా చీల్చి పేగులు బయటకు తీసిన సంఘటన చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో సంచలనంగా మారి ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫాతిమా అనే మహిళ ఎల్లమంద గ్రామంలో నివసిస్తుంది. వారు ముగ్గురు అక్క చెల్లెలు తన చెల్లి అయిన ఆషా లింగంగుంట్ల గ్రామంలో నివసిస్తుండగా, ఫాతిమాకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కవల పిల్లలు మరో పిల్లోడు ముగ్గురిని లింగంగుంట్లలోని చెల్లి ఆషా వద్ద ఆదివారం ఉదయం వదిలి సాయంత్రం లోపు వస్తానని చెప్పి బాపట్లకు వెళ్లారు. ఇంతలోనే కరీముల్లాను(7) పిన్ని ఆషా దారుణంగా చంపిన సంఘటన చుట్టుపక్కల వారు తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జరగటంతో ఆషాకు చెందిన ఇద్దరు పిల్లలు, ఫాతిమాకు చెందిన ఇద్దరు పిల్లలు నలుగురు కలిసి ఒకే గదిలో గడియ వేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆ పిల్లలను బయటకు తీసుకువచ్చి ఆషాను పట్టుకొని, కరిముల్లా మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలుడి దారుణ హత్య.. అసలేం జరిగింది..? Rating: 5 Reviewed By: NEWS UPDATE