728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 7, 2020

శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేతపై విచారణకు జాయింట్ కలెక్టర్ ఆదేశం?

చిలకలూరిపేట: పట్టణంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపి, డంపింగ్ యార్డ్ లో పడవేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావును గత నెల 26వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 30వ తేదీన శ్రీనివాసరావు విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం అంటూ సి 1 క్లర్కు లెటర్ రాసి.. 30 తేదీన ఇన్స్పెక్టర్ను తిరిగి విధుల్లో చేరవలసిందిగా ఉత్తర్వులును మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాలపై 24x7 న్యూస్ అప్డేట్ లో ప్రచురించిన వార్తల ఆధారంగా కుక్కలను నిబంధనలు పాటించకుండా చంపినందుకు.. విచారణ చేయకుండా అతని సస్పెన్షన్ను నిలుపుదల చేసి జాయినింగ్ ఉత్తర్వులను ఎలా ఇచ్చారనే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సస్పెన్షన్ ఉత్తర్వులు ఎత్తివేసి జాయినింగ్ ఆర్డరును ఇచ్చిన మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులపై విచారణ నాలుగు రోజుల్లో జరగనున్నట్లు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేతపై విచారణకు జాయింట్ కలెక్టర్ ఆదేశం? Rating: 5 Reviewed By: NEWS UPDATE