చిలకలూరిపేట: పల్లె బిడ్డకు ఆ నింగే హద్దు కావాలని, ఏ విషయంలో పేద పిల్లలు తక్కువ కాదనే విషయాన్ని చాటిచెప్పాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజిని పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో రోజుకో సదస్సు పెడుతున్నారు. రెండో రోజు మహిళా సదస్సు పెట్టి అందరినీ ఆకర్షించిన ఎమ్మెల్యే విడదల రజిని మూడో రోజు ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం లో విద్యార్థులు, తల్లిదండ్రులతో విద్యా సదస్సు చేపట్టారు. ఈ కార్యక్రమం అందరిని ఆలోచింపచేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా యజ్ఞాన్ని చేపడుతున్నారంటూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించిన తీరు ఆకట్టుకుంది. గతంలో పిల్లలను బడికి పంపాలంటే పేదల్లో భయాందోళనలు ఉండేవని చెప్పారు. ఆ పిల్లలను చదివించుకోవాలంటే డబ్బులు కావాలని, అదే కూలికి పంపితే ఎంతో కొంత సంపాదించి పెడతారనే ఆలోచనలు చేసేవారని తెలిపారు. ఇప్పుడు ఈ ఆలోచనలకు అమ్మ ఒడి పథకం అడ్డుకట్ట వేసిందని చెప్పారు. ప్రభుత్వమే అమ్మ ఒడి పథకం ద్వారా బిడ్డలను పాఠశాలకు పంపే తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ అందరిలో పిల్లలను చదివించాలనే కోరికను నింపుతోందని చెప్పారు. పేద పిల్లలు బడిలో చేరడానికి కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బూట్లు.. అన్ని ప్రభుత్వమే అందజేస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ఇంగ్లిష్ మీడియం అందిస్తున్నామన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా అన్ని పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్ని వసతులతో కూడిన గొప్ప పాఠశాలలను విద్యార్థి లోకానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు, ఆంగ్ల మాధ్యమం చదువులు.. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నింటిని వినియోగించుకుని పేదింటి బిడ్డ... తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్య కోసం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడుతూ మాట్లాడారు. ఈ సదస్సులో విద్యార్థులు,వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
November 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: తల్లిదండ్రుల కలలను సాకారం చేయడమే సీఎం జగన్ లక్ష్యం: విడదల రజినీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

