చిలకలూరిపేట: ఈ రోజు (05-05-21) పసుమర్రు లోని వై.యస్ జగనన్న కాలనీ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి భరత్ గుప్తా, ఎమ్మెల్యే విడదల రజిని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మనకు లభించడం అదృష్టమని దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకోసం ఊళ్లు నిర్మిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. వైయస్‌ఆర్ జగనన్న కాలనీలు అన్ని హంగులతో... అందంగా తీర్చిదిద్దడమే కాకుండా... పేదలకు మంజూరు చేసిన ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయం అని, దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీవాసునుపూర్ అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ వేణుగోపాల రావు, డీఈఈ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ సుజాత, కమీషనర్ దేవరపల్లి రవీంద్ర, డీఈఈ అబ్దుల్ రహీమ్, ఎలక్ట్రికల్ ఏడీఈ రాంబోట్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఫాని, వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, ముస్లిం, మైనారిటీ డైరెక్టర్ దరియా వలి, కౌన్సిలర్లు విడదల గోపి, జాలాది సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి, చెమిటిగంటి పార్వతి, చింతపల్లి విల్సన్,బేరింగ్ మౌలాలి, మానుకొండ మాధవిరెడ్డి, ఎడ్ల ఇందిరా, షేక్ మీరాబి, షేక్ జమీలా, పుల్లగూర భరత్, నాయబ్ సైదా బి, షేక్ నసీమా బేగం, తోట నాగలక్ష్మి,చెంబేటీ భారతి, అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, ములకలూరి బాజి మున్నీ, షేక్ యూసుబ్ అలీ, షేక్ ఖాజా భాను, కొచ్చెర్ల విజయలక్ష్మి, బిట్రా రాజేంద్రప్రసాద్, వడితే కోట నాయక్, మరియు నాయకులు తోట బ్రహ్మస్వాములు, వేటపాలెం సుభాని, నాగభైరు వెంకట్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
June 5, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పసుమర్రులోని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
Rating: 5
Reviewed By: NEWS UPDATE




