చిలకలూరిపేట: పట్టణంలోని వార్డులలో వాలంట్రీలు ఎక్కడ ఏ పథకానికి డబ్బులు అడిగినా తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ రఫాని మీడియా సమావేశంలో వెల్లడించారు. 27వ వార్డులో ఒక వాలంట్రీ పథకాలకు డబ్బు అడుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చి వారిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వీరు తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఎక్కడ ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదని... అటువంటి అవినీతి ఏదైనా ఉంటే తమ పార్టీ కార్యాలయంలో గాని, కమిషనర్ కు గాని, తెలియజేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్, వివిధ మండల అధ్యక్షులు గొంటు శ్రీనివాస్ రెడ్డి, కాట్రగడ్డ మస్తాన్ రావు, దేవినేని శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
June 9, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సంక్షేమ పథకాల కొరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు: మున్సిపల్ చైర్మన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

