గుంటూరు: రూరల్ మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో హోం మరియు విపత్తు శాఖ మాత్యులు మేకతోటి సుచరిత పాల్గొన్నారు. మల్లవరం గ్రామంలో నూతన సచివాలయం, మిల్క్ యూనిట్ సెంటర్లు కు హోంమంత్రి సుచరిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మల్లవరం సర్పంచ్ పద్మావతి, జగన్మోహన్ రెడ్డి, ఏరువ సాంబిరెడ్డి, తురకపాలెం సర్పంచ్ సూర్యప్రకాష్ రావ్, ఎంపిటిసి అభ్యర్థి అంజిరెడ్డి, మెట్టు వెంకటప్పా రెడ్డి, ఎంఆర్వో మోహన్ రావు, ఎంపిడిఓ సుజాత, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ఉందని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందిస్తున్న ఘనత సీఎం కే దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాలా ద్వారా జరుగుతున్న సేవలు ఎంతో సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రెండు ఏళ్లలో ప్రత్తిపాడు నియోజకవర్గం లో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2 లక్షల 39 వేలకు పైగా లబ్ది పొందారని హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు.
June 14, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దే: హోంమంత్రి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

