నాదెండ్ల: తేనెటీగలు దాడిచేసి కుట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని కనపర్రు గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన పచ్చవ నాగేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న చెట్ట కొమ్మను నరుకుతున్నాడు. కొమ్మకు ఉన్న తేనె తుట్టె కదిలి తేనెటీగలు నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డాయి. అతనిని కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెందాడు.
July 12, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: తేనెటీగల దాడి... చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

