728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2021

ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించామని చెప్పి, ఇప్పుడు గాంధీ పార్కు తాకట్టు పెడతారా?: టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట: శాసనసభ్యురాలిగా విడదల రజిని ఎన్నికైన కొద్దిరోజుల్లోనే “అమృత్” పథకానికి సంబంధించి, ముఖ్యమంత్రి తో మాట్లాడి పేట పురపాలక సంఘం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 50 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా నిధులను మంజూరు చేయించాను అని గత 2019 ఆగస్ట్ నుండి పలుమార్లు ప్రకటనలు చేస్తూ వచ్చారు. పుర ప్రజలు అందరూ సదరు ప్రకటన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీల రహితంగా అందరూ ఆమె కృషిని కొనియాడరు. కానీ “అమృత్” పథకానికి పురపాలక సంఘ గ్రాంట్ కోసం గాంధీ పార్క్ ను తాకట్టు పెట్టారని విశ్వనీయ సమాచారం అందగానే, మేము సదరు నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తూ పత్రికా ప్రకటన చేశాము. మునిసిపల్ చైర్మన్ స్పందిస్తూ అమృత్ పథకానికి చెల్లించాల్సిన గ్రాంట్ కు లోనూ మాత్రమే తీసుకున్నాము, దానికి గ్యారెంటీ గాంధీ పార్క్ ను షూరిటీ ఇచ్చాము అని తెలియజేశారు. మేము అచ్చ తెలుగులో చెప్పిన గాంధీ పార్క్ తాకట్టును, వారు కొంత క్లాస్ గా గ్యారెంటీ, షూరిటీ అని చెప్పి అసలు విషయాన్ని ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2017 లో అమృత్ పథకం ఎంతో కష్టపడి పురపాలక సంఘానికి ప్రత్తిపాటి పుల్లారావు మంజూరు చేయించారు. అనంతరం కేవలం రెండు సంవత్సరాల్లో వారి హయాంలో 40 కోట్ల పనులు చేయడం జరిగింది. ప్రత్తిపాటి హయాంలో జరిగిన సదరు పనులకు సంబంధించి ఏ పురపాలక ఆస్తిని ఆనాడు తాకట్టు పెట్టలేదు. G.B.C నుండి S.S.Tవరకు 41 కిలోమీటర్ల 1.25, 1.00 డయామీటర్ సామర్థ్యం ఉన్న అంతర్గత ఫైపు లైను నిర్మాణాన్ని మా హయంలో 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మీరు వచ్చాక ఒక కిలోమీటర్ నిర్మాణం జరగలేదు అని ప్రశ్నించారు.

C.M గారిని ఒప్పించి, 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రాండ్ ఇప్పిస్తూన్నానని శాసనసభ్యురాలు ప్రకటించి ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. మునిసిపాలిటీ ఆస్తులు తాకట్టు పెట్టడం చరిత్రలో ఏనాడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పు కొంత కడుతు౦దని చైర్మన్ చెప్పిన విషయం పూర్తిగా అవాస్తవం. మన మున్సిపాలిటీ ఆస్తి మనం అప్పు పెట్టి రుణం తెచ్చుకున్నాం కాబట్టి, మొత్తం వడ్డీ, అసలు మునిసిపాలిటీయే కట్టాలి అన్న విషయం చైర్మన్ గారికి తెలియకపోవడం విచారకరం. అయినా గాంధీ పార్కు తాకట్టు పెట్టడానికి, C.M అంగీకారం ఎందుకు అని ప్రశ్నించారు. అమృత స్కీం కు C.M 50 కోట్లు నిధులు మంజూరు చేశారు అని చెప్పిన శాసనసభ్యురాలు అసలు నిజం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిన్న టిడిపి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్ లో ఆరుగురు కౌన్సిలర్లు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కాబట్టి ఇరువురు కౌన్సిలర్లు గాంధీ పార్క్ ను తాకట్టు పెట్టడానికి అంగీకరిస్తున్నారని చైర్మన్ గారు తెలియజేశారు. మరి 30 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్న వైసిపి పక్షంలో ఇద్దరు మాత్రమే నిన్నటి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కాబట్టి 28 మంది వైసీపీ కౌన్సిలర్లు గాంధీ పార్క్ తాకట్టును వ్యతిరేకిస్తున్నారని మేము భావించవచ్చా? అని ప్రశ్నించారు. 130 కోట్ల అమృత స్కీంకు సంబంధించి ఇప్పుడు వరకూ గత ప్రభుత్వ హయాంలో 40 కోట్ల మేర పని జరిగిందని ఒకవైపు మునిసిపల్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ లో చెబితే వారి అనంతరం మాట్లాడిన యార్డ్ చైర్మన్ అమృత స్కీంకూ గత ప్రభుత్వంలో కొబ్బరికాయ మాత్రమే కొట్టారని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కామెడీ పంచారని ఎద్దేవా చేశారు. తన వార్డులో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకున “అమృత” పథకంలోనే నిర్మించిన విషయం వారికి తెలియకపోవడం బాధాకరమని తెలిపారు. 

ప్రత్తిపాటి ఏమి అభివృద్ధి చేశారో మీ ఆరో వార్డులో గత 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధిని ఒక్కసారి చూసుకోవాలని చలోక్తులు విసిరారు. ఇప్పటికైనా అభివృద్ధి పనుల పేరిట గాంధీ పార్క్ ను తాకట్టు పెట్టే ప్రకియ ఆపాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యురాలు గతంలో చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 50 కోట్లు సాధించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గంగా శ్రీనివాస రావు( 4వ వార్డు), కొత్త కుమారి (8వ వార్డు), కనమర్లపూడి లక్ష్మీ తిరుమల (21 వ వార్డు), కూనల ప్రమీల (22 వ వార్డు) కంచర్ల కరుణ (23 వ వార్డు), రాయని హరిత (36 వ వార్డు), పాములపాటి శివ కుమారి (37 వ వార్డు), జంగా సుజాత (38వ వార్డు), ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్ కరిముల్లా, జమాల్ బాషా, ఇనగంటి జగదీష్ బాబు, అందెల శౌరీ, షేక్ యాసీన్, మురకొండ మల్లిబాబు, షేక్ అజారుద్దీన్, మద్దుమాల రవి, షేక్ జానీ భాష, బెజ్జం రవి, కొత్త కోటేశ్వరరావు, షేక్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించామని చెప్పి, ఇప్పుడు గాంధీ పార్కు తాకట్టు పెడతారా?: టీడీపీ కౌన్సిలర్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE