728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 11, 2021

చిలకలూరిపేట: పెన్షన్లు పోతున్నాయని... స్టేట్మెంట్లో కోసం విద్యుత్ కార్యాలయం వద్ద వృద్దుల పడిగాపులు

చిలకలూరిపేట: విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఒక ఆధార్ కు నలుగురైదుగురు విద్యుత్ మీటర్లకు లింక్ చేయటం అటువంటి లోపాలతో తమకు వృద్ధాప్య పెన్షన్లు పోతున్నాయని పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన వృద్ధులు విద్యుత్ ఆఫీస్ వద్దకు ఈరోజు చేరుకున్నారు. తాము ఎల్ఈడీ బల్బుల కోసం ఆధార్ నెంబర్లు ఇచ్చినప్పుడు ఎవరివి వారికి లింకు చేయకుండా ఎవరో విద్యుత్ మీటర్లకు తమ ఆధార్  లను  లింకు చేశారని వృద్ధులు ఆరోపించారు. 50 శాతం వరకు ఇలా తప్పిదాలు జరిగాయని విద్యుత్ కార్యాలయం ఎదుట బాధను విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు వృద్ధులు.  పట్టణంలోని 10వ వార్డుకు చెందిన 40 మంది వృద్ధులు ఆ వార్డ్ కౌన్సిలర్ మౌలాలి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లి కౌన్సిలర్ ద్వారా తమకు వెంటనే ఆరు నెలల స్టేట్మెంట్ ఇచ్చి ఇతర పేర్లతో ఉన్న విద్యుత్ మీటర్ల కు తమ ఆధార్ లింక్ విషయాన్ని గుర్తించి వెంటనే వాటిని రద్దుచేసి ఇవ్వాలని కోరారు.    పట్టణంలో 1032 మందికి విద్యుత్తు వివిధ కారణాలతో వృద్ధాప్య పెన్షన్లు విచారణకు రాగా వీటిలో 80 శాతం విద్యుత్ కారణాలతోనే పెన్షన్లు ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 11వ తేదీ విచారణకు ఆఖరు తేదీ కావడంతో వృద్ధులు అనేకమంది విద్యుత్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పెన్షన్లు పోతున్నాయని... స్టేట్మెంట్లో కోసం విద్యుత్ కార్యాలయం వద్ద వృద్దుల పడిగాపులు Rating: 5 Reviewed By: NEWS UPDATE