728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 16, 2021

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలోని సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన గోగుల కోటేశ్వరరావు (48) అనే కౌలు రైతు పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల ప్రకారము సొలస గ్రామానికి చెందిన కోటేశ్వర రావు 15 ఏళ్ళ క్రితం సంకురాత్రిపాడు గ్రామానికి వచ్చి స్తిరపడ్డాడు. ఇక్కడే నివాసం ఉంటూ కౌలుకు పొలం తీసుకుని సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది కూడా సుమారు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మిరప పైరు దెబ్బతింది. మంగళవారం రాత్రి గొరిజవోలు గ్రామ పరిధిలోని పొలాల్లోకి వెళ్లి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని బుధవారం ఉదయం ప్రక్క పొలాలకు చెందిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ ఐ సతీష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య Rating: 5 Reviewed By: NEWS UPDATE