728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 26, 2021

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు


చిలకలూరిపేట: గణపవరం  ప్రసూన వంశీ క్రిష్ణ స్పిన్నింగ్ మిల్లు సమీపంలో  రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  భవనం టెక్స్టైల్స్ లో కార్మికులుగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో మెడిసిన్స్ కోసమని గణపవరం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది.  ఒరిస్సాకు చెందిన బదన్ కుమార్ బాయ్ (28), దీపక్ ప్రధాన్ (28) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎమ్ టి వెంకటసుబ్బయ్య , పైలెట్ శివ నాగ ఆంజనేయులులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బదన్ కుమార్ బాయ్ చికిత్స పొందుతూ చిలకలూరిపేట ఆస్పత్రిలో మృతి చెందాడు. దీపక్ ప్రధాన్ ను  మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE