గుంటూరు ఛానెల్ ను పర్చూరు వరకు పొడగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న రైతులకు హోంమంత్రి మేకతోటి సుచరిత బాసటగా నిలిచారు. పర్చూరు నుండి ప్రత్తిపాడు వరకు పాదయాత్ర గా వెళ్తున్న రైతులను వరగాని వద్ద హోంమంత్రి సుచరిత కాన్వాయ్ ఆపి పలకరించడం జరిగింది. గుంటూరు ఛానెల్ పొడగింపు తన బాధ్యత అంటూ హోంమంత్రి సుచరిత నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్ల రాజమోహన్ రావు, రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే దీని గురించి సంబందిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు హోంమంత్రి గుర్తుచేశారు. ఈ సందర్బంగా హోంమంత్రి రైతులు వినతిపత్రం ను ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు లో రైతులకు అండగా ఉంటానని హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు.
గుంటూరు: పాదయాత్ర చేస్తున్న రైతులకు హోంమంత్రి హామీ