చిలకలూరిపేట: గుంటూరు జిల్లాలో కరోనా కేసులు గత వారం నుండి భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. చిలకలూరిపేట పట్టణంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పట్టణంలో ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రెండు ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీలో సోమవారం నుండి కరోనా చికిత్స చేయటానికి అనుమతి మంజూరు చేసింది. ఇంకొక చిన్న పిల్లల ఆసుపత్రికి కూడా అనుమతి మంజూరు చేసి వైద్య చికిత్సలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. రెండు ఆసుపత్రిలలో ఆరోగ్యశ్రీ నమోదు చేయటానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ లను కూడా సోమవారం నియమించింది. అయితే కేసులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉండటంతో మున్సిపల్, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ కోవలో కోవిడ్ కేర్ సెంటర్ ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని సంబంధిత అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
January 11, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కరోనా చికిత్సకు సన్నాహాలు... కట్టడికి చర్యలు..!
Rating: 5
Reviewed By: NEWS UPDATE
