728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 11, 2022

చిలకలూరిపేట: నిత్యావసర ధరలు తగ్గించాలని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన


చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్ ఆధ్వర్యంలో, ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టుట గురించి, చిలకలూరిపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, తాహసిల్దార్ జి.సుజాత కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శిగుర్రం నాగ పూర్ణచంద్రరావు, నరసరావుపేట పార్లమెంటరీజిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖుమీర్, నరసరావుపేట పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అందెలశౌరీ, మాజీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి జరుగుమల్లి చెన్నయ్య, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు షేక్ హుస్సేన్ లు ప్రసంగించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండువిడతలుగా విజృంభించిన కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ, ఉపాథి అవకాశాలు కోల్పోయి సామాన్య ప్రజానీకం జీవనం అత్యంత దుర్భరంగా తయారైంది. ఈ నేపథ్యంలో ధరలను అదుపుచేసి పేదవాడికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం గోరుచుట్టుపై రోకటిపోటులా రకరకాల పన్నులు విధించడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేదవాడికి మూడుపూటలా పట్టెడన్నం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం మోపుతున్న భారాలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కరోనా నేపథ్యంలో ఉపాధి దెబ్బతిని పేదల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి.
దీనికి తోడు ఇంటి పన్ను, చెత్తపన్ను, కరెంటు ఛార్జీల పెంపు, మరుగుదొడ్డి పన్ను, ఆస్తి పన్ను, ఓటీఎస్ ల పేరుతో ప్రభుత్వం ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తోంది. అంతంతమాత్రంగా ఉన్న ప్రజల ఆదాయాన్నంతా ప్రభుత్వం పన్నుల రూపంలో గుంజుకోవడంతో సామాన్యుడు బతుకుబండి లాగడం భారంగా మారింది. మరోవైపు దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సిమెంట్, ఇసుక ధరలను పెంచడంతో నిర్మాణ రంగం కుదేలై కార్మికులు రోడ్డునపడ్డారు.129 అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. అన్నదాత ఎన్నడూ లేనివిధంగా పంటనష్టాలు చవిచూసి అప్పులపాలయ్యాడు. ఆపత్కాల సమయంలో రూ.5 లకే కడుపునిండా తిండిపెట్టే అన్నా క్యాంటీన్లు సైతం ప్రభుత్వం కక్ష్య పూరితంగా, మూసేసి పేదవాడి పొట్టగొట్టింది. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సమయంలో పేదల మొహాల్లో ఆవేదన గోచరిస్తోంది. పండగపూట పేదవాడు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ తోఫాలను అందించగా, గత రెండున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కానుకలను రద్దు చేసింది. ప్రస్తుత పరిస్థితిలో రోజువారీ జీవనం గడపడమే కష్టసాధ్యంగా మారింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం నిత్యావసర ధరలను తగ్గించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నిత్యావసర ధరలు తగ్గించాలని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE