728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 9, 2022

జిల్లా కలక్టరేట్‌ వద్ద జరుగు ధర్నాను విజ‌య‌వంతం చేయాలి


 చిల‌క‌లూరిపేట‌: 

నిరుద్యోగులను ప్ర‌భుత్వం దారుణంగా వంచించింద‌ని, ఇందుకు నిర‌స‌న‌గా గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగే ధ‌ర్నాను విజ‌యం చేయాల‌ని  ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభాని కోరారు.  ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాల‌యంలో బుధ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగుల పోరాట స‌మితి ఆధ్వ‌ర్యంలో   గుంటూరు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం నిర్వ‌హించ‌నున్న  ధ‌ర్న పోస్ట‌ర్‌ను యువ‌జ‌న‌, విద్యార్ధి  సంఘాల తో  క‌ల‌సి ఆవిష్క‌రించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 35 వేల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్ 1,2,3,4 పోస్టుల సంఖ్య పెంచాలని, 6500 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, 25 వేల టీచర్ పోస్టులు భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 పెంచరాదని, ఇందువ‌ల్ల  నిరుద్యోగుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు.  ఆంధ్రప్రదేశ్ లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి క్యాలండర్ విడుదల చేయాలని, ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు పరీక్ష తేదీలు ప్రకటించాలని కోరారు.  టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి షేక్ జాకీర్ మాట్లాడుతూ  ఎపిపిఎస్సీ పరీక్షలకు ప్రిలిమినరీ, నెగెటివ్ మార్కులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  జిల్లా కలక్టరేట్‌  వద్ద జరుగు ధర్మాలలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి రాకపోతే గతంలో మాదిరిగానే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  కార్య‌క్ర‌మంలో ఎన్ఎస్‌యూ అధ్య‌క్షుడు షేక్ బాష‌, ఏఐఎస్ ఎఫ్ ఏరియా అధ్య‌క్షుడు దుర్గారావు, ఉపాధ్య‌క్షుడు అబ్దుల్లా, ఐటీడీపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అమ‌రా మ‌ణికుమార్‌, టీఎన్ఎస్ ఎఫ్ పార్ల‌మెంట‌రీ అధికార ప్ర‌తినిధి ఎం చంద్ర‌శేఖ‌ర‌రావు లు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జిల్లా కలక్టరేట్‌ వద్ద జరుగు ధర్నాను విజ‌య‌వంతం చేయాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE