728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 19, 2022

చిలకలూరిపేట: మద్యపాన నిషేధం ఏది? జే బ్రాండ్స్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు ... టీడీపీ


 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరియు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు  ఆదేశాల మేరకు, చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్  ఆధ్వర్యంలో, రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యపాన నిషేధం, జే బ్రాండ్స్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ  నిరసన  కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ,   ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తీరా సీఎం అయ్యాక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ద్వజమెత్తారు.  జే బ్రాండ్స్  తో  జగన్ మోహన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధిస్తా  అని.. నాటుసారాను రూపుమాపుతానని మాయ మాటలు చెప్పారని,  కానీ అధికారంలోకి వచ్చాక   జే బ్రాండ్స్  నాసిరకం   మద్యం అమ్మడమే  కాక మరోవైపు నాటు సారా మాఫియాని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, కమీషన్లకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి గారి  జే బ్రాండ్స్ కల్తీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ మరోవైపు నాటు సారా మాఫియాని పెంచి పోషిస్తూ పచ్చని కుటుంబాలను నాశనం చేస్తూన్నారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో ఏపీని సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దితే నేడు నాటుసారా, నాసిరకం మద్యం గంజాయి అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో ఒకవైపు డాక్టర్ల రిపోర్టులు అన్ని మద్యం తాగడం వల్లే మరణించారని చెబుతుంటే,  ముఖ్యమంత్రి? మంత్రులు? మాత్రం అవి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు  చెప్పడం  సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి, ఇంత మంది మహిళలు మంగళసూత్రాలు తెగడానికి, ఆ కుటుంబాలు రోడ్డున పడటానికి కారణం జగన్ మోహన్ రెడ్డి  కాదా అని ప్రశ్నించారు? ఇవన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యలేనన్నారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగి పోతుందని, ఈ దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుబడిన దాని మూలాలు ఏపీ లోనే ఉంటున్నాయి అన్నారు. జంగారెడ్డిగూడెంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్స్  నాటు సారా తాగి మరణించిన వారి కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మద్యపాన నిషేధం ఏది? జే బ్రాండ్స్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు ... టీడీపీ Rating: 5 Reviewed By: NEWS UPDATE