728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 30, 2022

చిలకలూరిపేట: మహిళా కూలీలతో వస్తున్న ఆటో బోల్తా

 

చిలకలూరిపేట నర్సారావుపేట రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటో తిరగబడి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కొనిదెన గ్రామానికి చెందిన 12 మంది మహిళా కూలీలను నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలోని వ్యవసాయ కూలి పనుల నిమిత్తం ఉదయాన్నే వచ్చి తిరిగి వెళ్ళుతుండగా కొండ్రుపాడు లింగంగుంట్ల మధ్యలో గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఆటో పొలాలోనికి దూసుకెళ్లి తిరగబడింది. ఆటో డ్రైవర్ అంజయ్య తో పాటు 12 మంది మహిళా కూలీలకు  ఎటువంటి ప్రాణాపాయం లేదని 108 సిబ్బంది శోభన్ బాబు తెలియజేశారు.  స్వల్ప గాయాలైన మహిళలను 108లో ఆస్పత్రికి తరలించారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మహిళా కూలీలతో వస్తున్న ఆటో బోల్తా Rating: 5 Reviewed By: NEWS UPDATE