728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 24, 2022

భగ్గుమన్న కోనసీమ... అమలాపురంలో మంత్రి ఇల్లు తగలబెట్టిన ఆందోళనకారులు



అమలాపురం: మంత్రి విశ్వరూప్‎కు నిరసన సెగ తగిలింది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని జేఏసీ నేతలు, స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న కార్లకు నిప్పు అంటించారు. మంత్రి విశ్వరూప్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భగ్గుమన్న కోనసీమ... అమలాపురంలో మంత్రి ఇల్లు తగలబెట్టిన ఆందోళనకారులు Rating: 5 Reviewed By: NEWS UPDATE