చిలకలూరిపేట పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. మంత్రి వర్సెస్ మాజీమంత్రి పై ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్య సమావేశం చివరన సమావేశం దశాభాసగా మారింది. డెంగ్యూ మరణాలపై టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై మంత్రికి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేయగా .... మాజీ మంత్రి పుల్లారావు చర్యలు సిగ్గు సిగ్గు అంటూ వైసిపి కౌన్సిలర్ మౌలాలి అనటం పుల్లారావు సామాన్యుడే నేను కౌన్సిలరు ను అని మౌలాలి అనటంపై సమావేశం వేడెక్కింది. మీకు మేము క్షమాపణ చెప్పం ఫ్లో లో వచ్చిందని టిడిపి సభ్యుడు గంగా శ్రీనివాసరావు అన్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయం, బార్ షాపులో సంవత్సరానికి వాటా తీసుకోవడం లో పుల్లారావు పాత్ర ఉందని వైసిపి సభ్యుడు మౌలాలి ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పుడున్న బార్ షాపుల్లో మీ పార్టీ వారు కూడా వాటా ఉందని ప్రతి ఆరోపణ చేశారు.
కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశమైన విష జ్వరాలు, సిల్టు తీయటం, ఆక్రమణ గురించి చైర్మన్ అధికారులతో చర్చించి మాట్లాడించారు. డెంగ్యూ మరణాలు చిలకలూరిపేటలో లేవని కందిమల్ల ఆసుపత్రి నుంచి తెచ్చిన లెటర్ ను చైర్మన్ సమావేశంలో సభ్యులకు చూపించారు. మలేరియా జిల్లా అధికారి మాట్లాడుతూ దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ శ్రీనివాసరావులు పారిశుద్ధ కార్మికులు తీసుకుంటున్న చర్యలు శానిటేషన్ పై మాట్లాడారు. శిల్టు ఎంత తీశారు ఏమిటని డిఈ రమణ కౌన్సిల్ సభ్యులకు సమాధానం చెప్పారు.
పదో వార్డులో ఎన్టీఆర్ సుజల పథకం బిల్లులు డ్రాయినట్లు ఆర్టిఐ యాక్ట్ కింద సంచారం ఎవరిచ్చారు... తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై చర్యలు తీసుకొని మెమో జారీ చేయాలని చైర్మన్ రఫాని కమిషనరు ను ఆదేశించారు. మొత్తం మీద మొదటి గంటసేపు పై తెలిపిన అంశాలపై చర్చ జరగగా చివరగా ప్రస్తుత మంత్రి... మాజీ మంత్రి ఇరువురిపై వైసిపి,టిడిపి సభ్యులు ఆరోపణలు చేయడంతో మా నాయకురాలును అంటే మీ సంగతి తెలుస్తాము.... మా నాయకుడింటే మీ సంగతి తెలుస్తావనటం తో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశం ముగిసింది.

