చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం రసాభాసగా మారింది. అంశాలన్నీ చదివిన తర్వాత సమస్యలపై మాట్లాడాలని చైర్మన్ రఫాని సూచించగా 34 అంశాల అనంతరం చిలకలూరిపేట పట్టణంలో ఉన్న అనాధరైజుడు పంపులను రెగ్యులర్ చేసే విషయంపై సూచన సలహాలు ఇవ్వవలసిందిగా చైర్మన్ రఫాని కోరారు.
ఈ విషయంపై కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కుళాయిలు వేసుకునేటప్పుడు అధికారులకు తెలియదా వారి సహకారం లేకుండా ప్రజలు కుళాయిలు వేసుకోగలుగుతారని ప్రశ్నించారు. కౌన్సిల్ హాల్లో వైసిపి టిడిపి సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతరం అజెండాలోని ఒకటో అంశంపై జగనన్న కాలనీలో అభివృద్ధి లేదని కాలనీ విషయంలో రైతుల వద్ద మంత్రి భారీగా ముడుపులు తీసుకున్నారని అందువల్ల హైకోర్టు నోటీసులు జారీ చేసిందని గంగా శ్రీనివాసరావు అనడంతో చైర్మన్ రఫాన్ని గంగా శ్రీను ను సస్పెండ్ చేస్తానని అన్నారు. వైసీపీ కౌన్సిలర్ మౌలాలి, కోట నాయక్, ఓలేటి వెంకటేశ్వరరావు గంగా శ్రీనివాసరావు తో చాలాసేపు వాదొపువాదాలు చేసుకున్నారు. అనంతరం కౌన్సిల్ హాల్ బయట టిడిపి పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీలన్నీ అవినీతిమయమని జనవరి ఒకటవ తేదీన మంత్రి ఇంటి వద్ద జరిగిన సభకు మున్సిపల్ కౌన్సిల్ ఎందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించారు.
పట్టణంలోని కే.బీ రోడ్లో ఉన్న మసీదు పక్కన బార్ షాప్ ఎదురు షెడ్డు ఆక్రమణ చేసి కట్టడాన్ని ముస్లిములు క్షమించరని ఈ విషయంపై తాము ముస్లింలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా...?.సస్పెండ్ చేస్తే చేసుకోమను అని గంగా శ్రీనివాసరావు చైర్మన్ కు సవాల్ విసిరారు..

