చిలకలూరిపేట:
గతం నుంచి చిలకలూరిపేటకు చెందిన కొంతమంది రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం కేంద్రంగానే వివిధ ప్రాంతాలను అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతుందన్న విషయం బహిరంగ రహస్యమే. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వాల ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులు సిండికేట్‌గా ఏర్పడి రాత్రి వేళ లారీలు, మినీవ్యాన్‌లు, ఆటో ట్రాలీలలో పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు.
కొనసాగిన లావాదేవీలు..వివిధ మార్గాల్లో అక్రమార్జన...
వ్యాపారులు రేషన్ డీలర్ల నుంచి క్వింటా బియ్యాన్ని రూ.వెయ్యి నుంచి రూ.1200 కొనుగోలు చేసి అదే బియ్యాన్ని రూ.1800 విక్రయిస్తున్నారు. మరోవె వైపు వ్యాపారులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పోగు చేసి రైస్‌మిల్ల ర్లకు సైతం విక్రయిస్తుంటారు.అక్కడ ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సాధారణ బియ్యం మాదిరి వినియోగ దారులకు అంటగడుతుంటారు. లేదా ప్యాకింగ్ మార్చి మరో ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తుంటారు. చిలకలూరిపేటకు శివారు ప్రాంతంలో ఉన్న రైసుమిల్లులలో గతంలో టన్నల కొద్ది బియ్యం ఇలా పాలిష్ చేస్తూ పట్టుబడిన విషయం విదితమే. మరోవైపు పట్టణంలోనడి బొడ్డున చలివెంద్ర బజార్, శాంతి నగర్ లో ఇరువురు వ్యాపార వేత్తలు పిండిమర పేరుతో రేషన్ బియ్యాన్ని పిండిగా మార్చి లక్షలు అర్జిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇతనిపై పలుమార్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించినా అతని పద్దతి మార్చుకోక ఇదే వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
పక్కగా అక్రమ రవాణా...
కొన్ని రోజుల వరకు చిలకలూరిపేటకు సరిహద్దుగా ఉన్న జిల్లాలోని గ్రామీణ ప్రాంత మిల్లలకు తరలించి, అక్కడి నుంచి రవాణా చేసిన అక్రమ వ్యాపారులు ఆ జిల్లాలో పరిధిలో అధికారులు అమ్రమత్తం కావటంతో తమ రూట్ మార్చుకున్నారు. వీటిని పల్నాడు ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాంతానికి చెందిన వ్యాపార వెత్తకు బియ్యం అప్పగించటానికి స్థానిక వ్యాపారులు శివారు ప్రాంతం వరకు పట్టుబడకుండా చూసుకోవాలి. ఇందుకు బియ్యం లారీలకు అర కిలోమీటర్ ముందు ముఠా సభ్యులు కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తు పరిస్థితులను సమీక్షిస్తుంటారు. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేకపోతే వెంటనే మారో మార్గంలో తరలిస్తారు. లేదా బియ్యం లారీ ని పరిస్థితి చక్కబడేవరకు నిర్మానుష ప్రదేశంలో నిలిపి ఉంచుతారు. పొరపాటున తనిఖీల్లో పట్టుబడినా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులు, డ్రైవర్లతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలా పక్కాగా బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం.

