చిలకలూరిపేట వైసీపీలో ముసలం రోజురోజుకు పెరిగిపోతుంది. చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి టికెట్ కావటి మనోహర్ నాయుడు కు అధిష్టానం ప్రకటించింది. అయితే చిలకలూరిపేట పట్టణంలోని వైసీపీ ఎన్నికల కార్యాలయంలో వైసీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద నూతన యార్డ్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఎడ్లపాడు జడ్పిటిసి ముక్తా వాసు, మండల నేత చల్లా యజ్ఞేశ్వర రెడ్డి, చిలకలూరిపేట పార్టీ అధ్యక్షుడు వేములయ్య లతోపాటు గ్రామాలకు చెందిన నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ లకు సన్మాన అనంతరం మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ తాను ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని మంత్రి విడదల రజనీ వచ్చి తాను చిలకలూరిపేట తరపున పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే మంత్రి విడుదల రజిని వెన్నుపోటు పొడిచి తాము చేస్తున్న కుంభకోణాలు బయటకు రాకూడదని నెపంతో మరో వ్యక్తికి సపోర్ట్ చేసి టికెట్ వచ్చేట్టు చేసినట్లు ఆరోపించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తన పోటీలో ఉంటానని గడపగడపకు తిరుగుతారని తన కుటుంబం మూడు తరాలుగా రాజకీయ లోనే ఉన్నట్లు ఇంతమంది అభిమానంతో ఉన్నప్పుడు ఇంతకంటే నాకేం కావాలంటూ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ సభ ముగించారు.
March 16, 2024
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఎన్నికల్లో పోటీ చేస్తానన్న మల్లెల... మంత్రి రజనీపై తీవ్ర ఆరోపణలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

