చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. బుధవారం తన వైఎస్ఆర్సిపి సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. గత రెండు నెలలుగా వైఎస్ఆర్సిపికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మర్రి రాజశేఖర్ కు క్యాబినెట్లో బెర్త్ ఖాయమని అప్పటి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయినా కానీ మర్రి రాజశేఖర్ కు మొండి చేయి చూపడంతో ఆయన అదే పార్టీలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అయితే చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి పదవి రాజశేఖర్కి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ యొక్క పదవిని విడదల రజిని కేటాయించడంతో అప్పటినుండి తీవ్ర అసంతృప్తిగా ఉన్న మర్రి రాజశేఖర్ ను టిడిపిలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. రెండు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన మర్రి రాజశేఖర్ నిర్ణయం బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవిక్కూడా రాజీనామా చేయటానికి శాసనమండలికి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం..
వైసీపీకి గట్టి షాక్.... రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్