ఈపూరు:క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు అన్నారు. మండలంలోని ముప్పాళ్ళ ధనలక్ష్మి వ్యాయామ కళాశాలకు చెందిన క్రీడాకారులు గుంటూరు సమీపంలోని చౌడవరం గ్రామం ఆర్ వి ఆర్ అండ్ జెసి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 18 మరియు 19వ తేదీల్లో జరిగిన అంతర్ కళాశాలల సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొని ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు గురువారం తెలిపారు. సాఫ్ట్ బాల్ పోటీలలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొనగా 9 జట్లలో మంచి ప్రతిభ కనబరిచి తమ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని,పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని,క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని,క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి, మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయన్నారు. అనంతరం ప్రథమ స్థానం సాధించిన తమ కళాశాల క్రీడాకారులను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మేదరమెట్ల రామ శేషగిరిరావు అధ్యాపకులు ఆర్ బలరాం నాయక్ సిహెచ్ అరవింద్ ఎం దాసు కే వంశీ చైతన్యలు అభినందించారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు