ఈపూరు:విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు అన్నారు. మండలంలోని ముప్పాళ్ళ ధనలక్ష్మి వ్యాయామ కళాశాల నందు బీపీఈడి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న కె నాగేంద్ర,ఎం ప్రేమ్ కుమార్, ఎస్.కె హయీమ్, పి.బాలకృష్ణ లు ఈనెల 18,19 తేదీలలో గుంటూరు సమీపంలోని చౌడవరం గ్రామం నందు ఆర్ వి ఆర్ అండ్ జె సి ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన అంతర్ కళాశాలల సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు తమ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని,అలాగే మే నెల మొదటి వారంలో నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ నందు జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు తమ కళాశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించునున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చుండు వెంకటరావు శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి, క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడుకోవాలని గెలిచినవారు ఓడిన వారిని.. హేళన చేయకుండా స్నేహ పూర్వకంగా క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు.అనంతరం విజయం సాధించిన తమ కళాశాల విద్యార్థులను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మేదరమెట్ల రామసేషగిరిరావు అధ్యాపకులు ఆర్ బలరాం నాయక్ సిహెచ్ అరవింద్ ఎం దాసు కే వంశీ చైతన్యలు అభినందించారు.
సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక