ఈపూరు:విద్యార్థులు మానసికంగా, ఉత్సాహంగా గడపాలంటే క్రీడలు ఎంతో అవసరమని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు అన్నారు. మండలంలోని ముప్పాళ్ళ ధనలక్ష్మి వ్యాయామ కళాశాలలో బీపీఈడి ప్రధమ,ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న ఎస్కే హాయిమ్, ఎం ప్రేమ్ కుమార్ లు చోడవరంలోని ఆర్ వి ఆర్ జె సి ఇంజనీరింగ్ కళాశాల నందు ఈనెల 20, 21వ తేదీల్లో జరిగిన అంతర్ కళాశాల బేస్బాల్ పోటీలలో పాల్గొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యారని ఈనెల చివరి వారంలో చండీగర్లోని పంజాబ్ యూనివర్సిటీ నందు జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు ప్రాతినిధ్యం వహించునున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూయువత వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి మార్గంలో నడవాలని, ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.
ఆటలపై మక్కువతో చదువును నిర్లక్ష్యం చేయొద్దన్నారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు బాగా చదవాలన్నారు. అనంతరం తమ కళాశాల విద్యార్థులను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మెదరమెట్ల రామ శేషగిరిరావు అధ్యాపకులు ఆర్ బలరాం నాయక్ సిహెచ్ అరవింద్ ఎం దాసు కె వంశీ చైతన్యలు అభినందించారు.