ఈపూరు:రైతులు పంటలు వేసుకుని మొదలు పంట నూర్పులు చేసేంతవరకు ఎప్పటికప్పుడు స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి ఆర్ రామారావు అన్నారు.పొలంపిలుస్తోందికార్యక్రమం మంగళవారం మండల కేంద్రమైన ఈపూరు,బొమ్మరాజుపల్లి గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల వద్ద రైతుల పొలాలకు క్షేత్ర సందర్శనతో పాటు రైతుల పొలాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమమన్ని మండల వ్యవసాయ అధికారి ఆర్ రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల పై ద్రుష్టి సారించాలని తద్వారా వేసిన పంటలలో పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం వారంలో ప్రతి మంగళ,బుధవారాలలో ప్రతి గ్రామంలో పొలాలను సందర్శించి రైతులకు యజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరుగుతుందన్నారు.రైతు విశిష్ట సంఖ్య నమోదుకు ప్రతి ఒక్క రైతు తన ఆధార్ కార్డు జిరాక్స్, పొలం పాస్ బుక్ జిరాక్స్ లేదా 1బి & రైతు యొక్క ఆధార్కు లింక్ అయినా ఫోన్ తీసుకొని రైతు సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని, రెండు లేదా అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాల్లో పొలం ఉన్న రైతులు ఏదైనా ఒక రెవిన్యూ గ్రామంలో నమోదైతే సరిపోతుందని తెలియజేశారు. అలాగే pmkisan ekyc పెండింగ్ వున్న వారు అలాగే మీ ఆధార్ కి బ్యాంక్ లింక్ లేని వారు పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని సూచించినారు,త్వరగా కంప్లీట్ చేసుకోవాలని,చేసుకొంటే వెంటనే నగదు వారి ఖాతా లో పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులు సల్మా , శేషు బాబు , పెద్దలు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలి...