చిలకలూరిపేట:ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” కార్యక్రమంలో భాగంగా స్కూల్లు మరియు కాలేజీలకు సమీపంలో ఉన్న షాపులలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్,ఎస్ఐలు పోలీసులు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని స్కూళ్లు మరియు కాలేజీలకు 100 గజాల సమీప దూరంలో ఉన్న షాపులు, దుకాణాలలో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై, స్పెషల్ డ్రైవ్ను లో భాగంగా చిలకలూరిపేటలో అర్బన్ పోలీసులు నిర్వహించి ప్రతి దుకాణంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.