మహారాష్ట్ర: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజు పదిహేను వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా కొత్తగా 2,436 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మహారాష్ట్రలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,667కు చేరింది.మహారాష్ట్రలో మరణాలు కూడా ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 60 మరణాలు చోటుచేసుకోవడంతో మొత్తం మరణాల సంఖ్య కూడా 1695కు చేరింది. ఇప్పటి వరకు 15,786 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వారిలో సోమవారం డిశ్చార్జి అయిన వారు 1186 మంది ఉన్నారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
May 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మహారాష్ట్రలో ఒకేరోజు 2,436 కొత్త కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

