చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల కంపెనీ రియల్ మీ ఇటీవలే స్మార్ట్ టీవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌ల తయారీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే స్మార్ట్ టీవీల ఫీచర్లను వెల్లడించిన కంపెనీ స్మార్ట్ వాచ్‌ల ఫీచర్లను తెలియజేసింది. రియల్ మీ ఈ స్మార్ట్ వాచ్ 1.4 అంగుళాల కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. బడ్జెట్ విభాగంలో పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉన్న మొదటి వాచ్ ఇదేనని సంస్థ తెలిపింది. నీలం, నారింజ, ఆలివ్ గ్రీన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ బాండ్లలో క్లాసిక్, ఫ్యాషన్ అనే రెండు ఆప్సన్స్ ఉంటాయని తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్ ధరను రూ.3,999 గా సంస్థ నిర్ణయించింది.రియల్ మీ స్మార్ట్ వాచ్ ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, బైక్, స్పిన్సింగ్, యోగా, క్రికెట్, రన్నింగ్, ఏరోబిక్ ఇలా 14 స్పోర్ట్ మోడ్లకు సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ రియల్ మీ వాచ్ మ్యూజిక్, కెమెరా యాప్‌లను కంట్రోల్ చేస్తుందని చెప్పారు. ఈ వాచ్ 160 ఎంఏహెచ్ బ్యాటరీ, వేర్ఓఎస్తో పనిచేస్తుందని తెలిపారు. ఇది ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుందన్నారు.అదేవిధంగా రియల్మీ సంస్థ 32, అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్‌తో రెండు స్మార్ట్ టీవలను కూడా తీసుకొచ్చింది. 32 అంగుళాల రియల్ మీ స్మార్ట్ టీవీ 1366x768 పిక్సెల్స్ రిజల్యూషన్, 43 అంగుళాల వేరియంట్ 1920x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 32 అంగుళాల టీవీ ధర రూ.12,999, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999 గా నిర్ణయించింది.వీటితోపాటు రియల్ మీ బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇయర్ ఫోన్స్ ధరను రూ.2,999 గా నిర్ణయించింది. ఈ రియల్ మీ టీవీలు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్లు జూన్ 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ.కామ్ లలో అభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత త్వరలోనే ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా ఈ ఉత్పత్తులు లభిస్తాయని రియల్ మీ కంపెనీ ప్రకటించింది.
May 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: అద్భుత ఫీచర్లతో రియల్ మీ స్మార్ట్‌వాచ్‌లు, టీవీలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

