728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

బిగ్ బ్రేకింగ్.. దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..

దిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.

ఫేజ్‌-1
🔹జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి
🔹జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి

ఫేజ్‌-2
🔹పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
🔹విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
🔹విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది.

వీటికి అనుమతి లేదు..

🔹మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు.

🔹అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు.
🔹సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బిగ్ బ్రేకింగ్.. దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు.. Rating: 5 Reviewed By: NEWS UPDATE