చిలకలూరిపేట: వలస కార్మికుల కన్నీళ్లను తుడుస్తున్న ప్రభుత్వం తమదేనని, దేశంలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్పందించి సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 70 పేద ముస్లిం కుటుంబాలకు శనివారం మాస్టర్ మైండ్స్ స్కూల్ ఆధ్వర్యంలో రంజాన్ కానుక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వలస కార్మికుల కోసం ప్రత్యేక నోడల్ అధికారిని తాము నియమించామన్నారు. వారి సమస్యల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటుచేశామని చెప్పారు. వలస కూలీల కోసం అన్ని సేవలు అందించేందుకు 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటుచేసిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. దేశంలోనే ఈ రాష్ట్రానికి కూడా సాధ్యం కాని రీతిలో వలస కూలీల విషయంలో మెరుగైన సేవలు అందజేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకందరికీ గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
May 22, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 70 కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

