728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

ఆ దివ్య గ్రంథం అవతరించిన మాసమిదే

పవిత్ర రంజాన్ నెలతో ఖురాన్‌కు ప్రత్యేక అనుబంధం.ఆ దివ్య గ్రంథం అవతరించిన మాసమిదే!ఖురాన్‌కు... రంజాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రమ్‌దామ్’ అనే అరబ్బీ పదం కాలక్రమేణ ‘రంజాన్’గా మారింది. పాప పరిహారాల కోసం ఈనెల అనువైన సమయం. రంజాన్‌లో ఖురాన్‌ను పూర్తిగా వినడం మహా ప్రవక్త (స) ఆచారం. హజ్రత్  జిబ్రయీల్ ఏటా రంజాన్‌లో మహాప్రవక్త (స)కు సంపూర్ణ ఖురాన్‌ను వినిపించేవారు. ఆయన ఆఖరు సంవత్సరంలో మహాప్రవక్తతోపాటు రెండుసార్లు ఖురాన్‌ను సంపూర్ణంగా పఠించారు. అందువల్ల ఈ మాసంలో ఇతోధికంగా ఖురాన్ పఠించడానికి ప్రయత్నించాలి. ఖురాన్‌ను నెమ్మదిగా, అవగాహన చేసుకుంటూ చదవాలి.

వజూ(ముఖం, కాళ్లు, చేతులూ శుభ్రం చేసుకోవడం) చేసిన తర్వాతనే ఖురాన్‌ను పఠించడం ఉత్తమం. ప్రతిరోజు ఖురాన్‌ను చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ గ్రంథంలోని 30 భాగాలను కంఠస్థం చేసిన వారిని హాఫీజ్ అంటారు. వారు ఏటా రంజాన్‌లో చదివే తరావీహ్(రాత్రి 8.30 గంటల సమయంలో) నమాజ్‌లో ఖురాన్‌ను వినిపిస్తారు. కాబట్టి తరావీహ్ నమాజులో ఖురాన్‌ను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి. అయితే ఈ ఏడాది కరోనా నేపధ్యంలో మసీదులో నమాజ్ నిర్వహించేందుకు ఇమామ్,మౌజన్ లతో పాటు మరో ముగ్గురికి మాత్రమే అనుమతివ్వడంతో చాలా మంది ముస్లిం సోదరులు తరావీహ్ నమాజ్ ల్లో పాల్గొనలేకపోయారు. 
ఎవరైతే ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అనుసరిస్తారో.. వారు ఇహ లోకంలో సన్మార్గానికి దూరం కాకుండా, పరలోకంలోనూ సఫలతను కోల్పోకుండా ఉంటారు. తాఖ్ రాత్రుల సందర్భంగా  మంగళగిరి మండలంలోని పలు మసీదుల్లో ఇమామ్ లు ఖురాన్ పఠనం గావించి ముస్లిం సోదరులకు వినిపించారు. ఇప్పటికే మూడు తాఖ్ రాత్రులు పూర్తి గాకా మరో రెండు తాఖ్ రాత్రులు (జాగారం)ను ముస్లిం సోదరులు ఉండాల్సి ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆ దివ్య గ్రంథం అవతరించిన మాసమిదే Rating: 5 Reviewed By: NEWS UPDATE