728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

చిలకలూరిపేటలో రెడ్ జోన్, బఫర్ జోన్లో ఏయే వ్యాపారాలు చేసుకోవచ్చు...

గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట పట్టణంలో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు అయిన సంగతి తెలిసిందే. సోమవారం రెండో పాజిటివ్ కేసు చినపీరుసాహెబ్ వీధిలో నమోదు అయినందున రెండు వందల మీటర్ల మేర రెడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు, 500 మీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు, అర్బన్ సీఐ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలియజేశారు.

♦️ రెడ్ జోన్ లో ఎటువంటి వ్యాపారాలు చేయకూడదని జనం ఇళ్లల్లో ఉండాలని వారికి కావలసిన నిత్యావసరాలు వాలంటీర్లు ద్వారా తేప్పించుకోవాలని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు.

♦️బఫర్ జోన్ లో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కేవలం నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల షాపులు,పాలు మాత్రమే అమ్ముకోవచ్చని సిఐ సూర్యనారాయణ తెలిపారు.

♦️అయితే బఫర్ జోన్ దాటిన తరువాత నిబంధనలను సడలించారు.  అన్ని రకాల వ్యాపారాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు చేసుకోవచ్చని అయితే నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఈ సందర్భంగా వారు వ్యాపారులను కోరారు.

♦️గోల్డ్ షాప్, సెలూన్లు, బట్టల షాపులు, రెడీమేడ్ షాపులు,చెప్పుల షాపులు నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్, అర్బన్ సీఐ కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.

♦️ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇళ్లల్లో ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సిఐ సూర్యనారాయణ ప్రజలను కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రెడ్ జోన్, బఫర్ జోన్లో ఏయే వ్యాపారాలు చేసుకోవచ్చు... Rating: 5 Reviewed By: NEWS UPDATE