728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు తగవు:ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్, చైర్మన్, ఘంటా రామారావు

ఆంధ్రప్రదేశ్:

★ రాజ్యాంగ విధుల్లో భాగంగా తీర్పులు వెలువరించే న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించడం తగదని ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు అన్నారు.

★ న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఆ ప్రకారం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఆయన చెప్పారు.

★ అంతేకానీ చట్టప్రకారం తీర్పులు వెలువరించె న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమన్నారు.

★ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మూడు విభాగాలకు రాజ్యాంగపరమైన బాధ్యతలు అప్పగించిందని దాని ప్రకారం శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే, సదరు చట్టాలను కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తోందన్నారు.

★ ఈ చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేకపోయినా, ప్రజల ప్రాథమికహక్కులకు భంగం కలిగించినా, చేసిన చట్టాలలో చట్టబద్ధత లేకపోయినా ఆ చట్టాలను సవరించడం లేదా కొట్టివేయడం కోర్టుల బాధ్యత అన్నారు.

★ రాజ్యాంగానికి లోబడి చట్టాలకు అనుగుణంగా న్యాయమూర్తులు తీర్పులు ఇస్తారన్నారు.

★ పై వ్యవస్థలన్నీ  వాటి వాటి పరిధిలో పని చేస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తున్నారు.

★ గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వారు కూడా దురదృష్టవశాత్తు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాల్సిన వారే అసభ్య పదజాలం వాడటం చాలా బాధాకరం అన్నారు.

★ ఎవరైనను న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అందరూ కూడా సంయమనం పాటించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని కోరారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు తగవు:ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్, చైర్మన్, ఘంటా రామారావు Rating: 5 Reviewed By: NEWS UPDATE