728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 28, 2020

ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్

అమరావతి:
★ ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను, నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది హైకోర్టు.

★ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయంటూ ప్రతీ ఒక్కరికీ సీరియస్ నెస్ వుండాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

★ ఏపీలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోవడం, ఆంక్షలను ఉల్లంఘించడం దాఖలైన ఫిర్యాదులపై హైకోర్టు ధర్మాసానం గురువారం విచారణ జరిపింది.

★ వైసీపీకి చెందిన ఓ మంత్రితోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో మొత్తం ఎనిమిది వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

★ గురువారం ఈ పిటిషన్లను విచారించిన.. ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎవరి మీదైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.

★ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌లకు హైకోర్టు సూచించింది.

★ ఫిర్యాదు తీసుకుని తద్వారా వారి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

★ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో కిషోర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE