న్యూఢిల్లీ:
★ వలస కార్మికుల అంశంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
★ బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని, రాష్ట్రాలు భరించాలని ఆదేశించింది.
★ అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని స్పష్టం చేసింది.
★ రైలు ప్రయాణం చేస్తున్న వలస కార్మికులకు మార్గ మధ్యంలో రైల్వే శాఖనే ఆహారం అందించాలని సూచించింది.
★ వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరే ముందే ఆయా రాష్ట్రాలు మంచినీళ్లు, ఆహారం అందించాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.
★ ముఖ్యంగా రోడ్ల వెంబడి నడుస్తోన్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
★ సహాయ శిబిరాలకు తరలించి ఆహారంతో పాటు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
★ సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని సుప్రీంకోర్టు తెలిపింది.
★ వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని తెలిపింది.
★ రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది.
★ మరోవైపు ఇప్పటివరకూ కోటి మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
★ వలస కార్మికులను ఆలస్యంగా తరలించాల్సి రావడానికి గల కారణాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
★ కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంతో పాటు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేసుకున్నాకే కార్మికుల తరలింపు ప్రారంభించామని కేంద్రం తెలిపింది.