728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

చిలకలూరిపేట లో కరోనా సమస్య పెరగనుందా...?

గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో క‌రోనా స‌మ‌సి పోయిందా... స‌మ‌స్య పెర‌గ‌నుందా..? అంతా స‌మ‌సిపోయింద‌నుకున్నాం.. నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా క‌థ ముగిసిపోయింద‌నుకున్నాం...కాని మ‌నం త‌లంచిన‌ట్లు క‌రోనా క‌థ ముగిసిపోలేదు. రానున్న రోజుల్లో ప్ర‌జ‌లు  అప్ర‌మ‌త్తంగా లేకుంటే ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగిస్తుంద‌ని గ‌త రెండు రోజుల నుంచి కొత్తగా  న‌మోదైన రెండు కేసుల హెచ్చ‌రిస్తున్నాయి.చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు నమోదైన మూడు కేసులు చిల‌క‌లూరిపేటకు సంబంధించిన కావని తెలుస్తోంది. మొద‌టిగా నమోదైన యువ వైద్యురాలి కేసు కూడా న‌ర‌స‌రావుపేటలో వైద్యం చేయ‌టం వ‌ల్ల సోకితే, నాదెండ్ల మండ‌లం చంద‌వ‌రంకు చెంది, క‌రోనా  సోకి మృతి చెందిన వృద్దుడు విజ‌య‌వాడ నుంచి రావ‌టం, కొత్త‌గా ప‌ట్ట‌ణంలో చిన‌పీరు సాహెబ్ వీధిలోని మ‌హిళ‌కు సోకిన క‌రోనా కూడా గుంటూరు నుంచి సోకి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు.ఇప్పుడే అప్ర‌మ‌త్త‌త  అత్య‌వ‌స‌రం ....లాక్‌డౌన్ స‌డ‌లిస్తున్నారు అంటే విచ్చ‌ల విడిగా రోడ్ల‌పై తిర‌గ‌టం కాద‌ని, మాస్కులు,భౌతిక దూరం పాటించ‌కుండా విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రించ‌టం కాద‌న్న నిజం ఇప్పుడ‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు తెలిసివ‌స్తుంది. లాక్‌డౌన్ స‌డ‌లింపుల వ‌ల్ల వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వారు చిల‌క‌లూరిపేట‌కు చేరుకుంటున్నారు. వ‌చ్చిన ప్ర‌తి వ్య‌క్తి అనుమానితుడిగా దూరం పెట్ట‌డం ఎంత‌టి అవివేకమో, వ‌చ్చిన వారితో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోటం అంతే అవివేకం అని పించుకుంటుంది. గ‌తం క‌న్న ఇప్పుడే ప్ర‌జ‌లు వివేకంతో వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌భుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌ను అత్య‌వ‌స‌ర విష‌యాల‌కే వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఫ‌లితాల‌పై ఆందోళ‌న ....ఇప్ప‌టికే క‌రోనా సోకి మృతి చెందిన చంద‌వరం వృద్దుడితో స‌న్నిహిత సంబంధాలు ఉన్న బంధువులను క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో పాటు ఈ నెల‌ 18 నుంచి 20 వరకు చందవరంకు  పేషెంట్ స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు ప‌ట్ట‌ణం, నాదెండ్ల‌, ప‌సుమ‌ర్రుల‌కు చెందిన తొమ్మిది మంది చికిత్స పొందారు.వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీరితో పాటు అత‌నికి  వైద్యం చేసిన డాక్టర్లు, నర్సులు, అక్కడ ఉన్న  సిబ్బంది, సెకండరీ, ప్రైమరీ కాంటాక్ట్ మొత్తం 121 మందికి  సోమ‌వారం  పరీక్షలు  డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. మ‌రోవైపు ప‌ట్ట‌ణంలోని చిన‌పీరుసాహెబ్ వీధిలో క‌రోనా సోకిన మ‌హిళ కు సంబంధించి య‌డ్ల‌పాడులో ఉన్న బంధువులు, స‌న్నిహితంగా మెలిగిన ప‌లువురిని ప‌రీక్ష‌ల కేంద్రాల‌కు త‌ర‌లించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డైతే త‌ప్ప ఎన్ని కేసులు నియోజ‌క‌వ‌ర్గం లో న‌మోద‌య్యాయ‌న్న విష‌యం తేల‌దు. ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌పై ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొని ఉంది. కుదేలౌతున్న బ‌తుకులు ... సుదీర్ఘ లాక్‌డౌన్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల జీవితాల‌ను అస్థ‌వ్య‌స్థం చేసింది. స‌గ‌టు కూలీలు మొద‌లు, చిరువ్యాపారులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌తో అస్థ‌క‌ష్టాలు ప‌డ్డారు. కేసులు పెరిగితే  మ‌రిన్ని  కంటోన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.చిల‌క‌లూరిపేట‌లో నిబంధ‌న‌లు క‌ఠినం చేయాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే సామాన్యులకు మ‌రిన్న క‌ష్టాలు త‌ప్ప‌వు. ఒక్క‌టి మాత్రం నిజం చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం, నిర్లిప్త‌త క‌రోనా మ‌హ‌మ్మారిని చే చేతులా ఆహ్వానించిన‌ట్లు అవుతుంది. ప్ర‌జ‌ల అప్ర‌మ‌త్త‌తే క‌రోనా నియంత్ర‌ణ‌కు స‌రైన మందు.



Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో కరోనా సమస్య పెరగనుందా...? Rating: 5 Reviewed By: NEWS UPDATE