అమరావతి:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, నారా లోకేష్ కామెంట్స్..
★ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి.
★ ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
★ 160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది.
★ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు.
★ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు.
★ ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి.
★ తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి.
★ ఏడాది పాలనలో 87 వేల కోట్ల అప్పు, పైగా రాష్ట్ర ఆస్తుల అమ్మకం ఒక్క ఛాన్స్ అడిగి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసి ''గన్నేరుపప్పు'' పేరుని సార్ధకం చేసుకున్నారు.
★ మాస్కు అడిగినందుకు ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారి పై పిచ్చివాడు అనే ముద్ర వేసింది తుగ్లక్ ప్రభుత్వం.
★ బాధితులు ఆసుపత్రిలో ఉంటే గ్యాస్ లీకేజ్ కి కారణం అయిన వారితో మంతనాలు,బాధితుల పై కేసులు. గ్యాస్ లీకేజ్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకునే దమ్ముందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు?
★ పేరాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా తగ్గిపోతుంది అని సెలవిచ్చిన మేధావి ఆఖరికి చేతులెత్తేసి వలస కార్మికుల పై కొరడా ఝుళిపించారు.
★ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతం మాట తప్పడం, కులం మడమ తిప్పడం. నవ రత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారు. మూడు వేల పెన్షన్, రైతు భరోసా, మద్యపాన నిషేధం, 45 ఏళ్లకే పెన్షన్, డ్వాక్రా రుణాల మాఫీ ఇచ్చిన ప్రతీ హామీకి షరతుల పేరుతో దగా. ప్రతీ స్కీమ్ వెనుక ఒక స్కామ్ జగన్ సర్కార్ మార్క్ దోపిడీ.
★ ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తరువాత ''షరతులు వర్తిస్తాయి''అంటూ మొహం చాటేసారు.నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా'' తైలంతో సరిపెట్టారు.ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు.